Sarpanch | గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తా..

Sarpanch | టేకుమట్ల, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధిలో మంచి మార్పును చూపడానికి అన్ని వర్గాలతో మమేకమై గ్రామ అభివృద్ధే ధ్యేయంగా భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావు పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన అనవేన సృజన రమేష్ కు గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇవ్వాలని ప్రజల నుండి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో హనుమాన్ టెంపుల్ నిర్మించడానికి కృషి చేస్తానని, జోడు పల్లె వరకు బస్సు సౌకర్యం కల్పించే విధంగా ఏర్పాటు చేస్తానని అన్నారు కాగా మన గ్రామంలోని దేవస్థానాలు అన్నిటికి నా వంతుగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారా నిర్మిస్తానని తెలిపారుగ్రామంలో గల్లి గల్లికి డ్రైనేజీ నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం, క్రీడలపై ప్రత్యేక కార్యక్రమాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మెగా వైద్య శిబిరం ఏర్పాటు, వీధి దీపాల ఏర్పాటు, విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపడం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తానని హామీ ఇస్తున్నారు. ఎన్నికల కమిషన్ కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. సర్పంచ్ ఎన్నికల ఇంటింటి ప్రచారంలో అందరి ఆదరణతో దూసుకుపోతున్నారు.
