Sarpanch | ఆలోచించి ఓటేయండి..

Sarpanch | ఆలోచించి ఓటేయండి..
- సర్పంచ్ గా అవకాశం కల్పించండి
- ప్రజాసేవ పరమావధిగా పనిచేస్తా
- గుడిగండ్ల సర్పంచ్ అభ్యర్థి పెద్ద నరసింహులు
- పెద్ద నరసింహులుకు మద్దతుగా కదం తొక్కిన మహిళా లోకం
Sarpanch | మక్తల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని సర్పంచ్ గా అమూల్యమైన ఓటు వేసి తనను సర్పంచిగా గెలిపించండి.. ప్రజాసేవే పరమావధిగా ఐదేళ్లపాటు గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తానని మక్తల్ మండలంలోని గుడిగండ్ల గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలిచిన పెద్ద నరసింహులు గ్రామస్తులకు విన్నవించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన ఇవాళ సర్పంచ్ అభ్యర్థి పెద్ద నరసింహులుకు మద్దతుగా మహిళా లోకం కదిలి వచ్చింది. వందలాది మంది మహిళలు వీధుల్లో ర్యాలీగా వెళ్లి ఇంటింటికి వెళ్లి బొట్టుపెట్టి పెద్ద నరసింహులను సర్పంచ్ గా గెలిపించాలని అభ్యర్థించారు.
ఈసందర్భంగా సర్పంచ్ అభ్యర్థి పెద్ద నరసింహులు మాట్లాడుతూ… నిస్వార్థంగా ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తున్నారన్నారు. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.. ఐదేళ్ల పాటు నిస్వార్థంగా సేవ చేసేందుకు తనకు సర్పంచిగా అవకాశం ఇవ్వండి.. ఇతరుల మాయమాటలు నమ్మి మోసపోకండి.. అంటూ ఆయన ఓటర్లను అభ్యర్థించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. అంతర్గత రోడ్ల నిర్మాణం మురుగు కాలువల నిర్మాణం చేపట్టడమే కాకుండా తాగునీటి సమస్య లేకుండా కృషి చేస్తానన్నారు.

గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా తనకు మద్దతు ఇవ్వవలసిందిగా ఆయన అభ్యర్థించారు. అందరి మద్దతుతో ప్రజాసేవ చేసేందుకు మీ ముందుకు వచ్చానన్నారు. మీ అందరివాడిగా తనను ఆశీర్వదించి విలువైన ఓటును ఇచ్చి ఈనెల 17న జరిగే ఎన్నికల్లో తనను గుడిగండ్ల గ్రామ సర్పంచ్ గా గెలిపించాలని కోరారు. సర్పంచ్ గా తనను గెలిపిస్తే అన్ని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని, తనను ఆదరించి ఒక్క అవకాశం ఇవ్వవలసిందిగా గుడిగండ్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థి పెద్ద నరసింహులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి లక్ష్మీ నర్సిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి, నాయకులు మేకల హన్మంతు, కురువ తిమ్మయ్య, కురువ ఎర్రప్ప, హనుమయ్య గౌడ్, టప్ప హనుమంతు, మోహన్ రెడ్డి, వడ్ల నర్సిములు, తదితరులు పాల్గొన్నారు.
