Sarpanch | వెంగలాపూర్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా…
- సర్పంచ్ అభ్యర్థి బలబత్తుల కిషన్ …
Sarpanch | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : గొల్లపల్లి మండలంలోని వెంగలాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ అభ్యర్థి బలబతుల కిషన్ అన్నారు. శనివారం గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించిన కిషన్ మాట్లాడుతూ… గతంలో సర్పంచ్ గా ఉన్నప్పుడు చాలా పనులు చేశానని, ఈసారి గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రజా సేవకుడిగా బహుజన బిడ్డగా పేరు గల కిషన్ గెలుపు బాటలో ముందున్నాడు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలుకుతున్నారు. సేవే లక్ష్యంగా నడుచుకునే కిషన్ సర్పంచ్ గా గెలవడం ముఖ్యమని, అన్ని వర్గాల ప్రజలు బాహాటంగా చెబుతున్నారు.

