Sarpanch | ఒక్క సారి అవకాశం ఇవ్వండి..

Sarpanch | ఒక్క సారి అవకాశం ఇవ్వండి..

  • ఆదర్శ గ్రామంగా మారుస్తా..
  • నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకులను ఉపయోగంలోకి తెస్తా
  • మిషన్ భగీరథ ద్వారా తాగు నీటిని ఇంటింటికి అందిస్తా
  • విద్యుత్ సరఫరా చేసే సర్వీస్ వైర్లకు నూతన కరెంట్ పోల్స్ నిర్మాణం
  • రైతులు పొలాలకు వెళ్ళే డొంక దారుల రూపురేఖలు మార్చుతా
  • కరివారి గూడెం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బోడ దుర్గా భీమారావు

Sarpanch | జూలూరుపాడు, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిపిస్తే కరివారిగూడెం ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బోడ భీమారావు ఓటర్లను అభ్యర్థించారు. ఇవాళ‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కరివారిగూడెం గ్రామ పంచాయతీ స్థానానికి పోటీ చేస్తున్న బోడ దుర్గా భీమారావు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యర్థి భర్త భీమారావు మాట్లాడుతూ… గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి రెండు సార్లు ఓటమి పాలైన గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నానన్నారు.

పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన త‌న సతీమణి బోడ దుర్గాను గ్రామ ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందని, గ్రామంలోని రెండు వాటర్ ట్యాంకులు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే రెండు ట్యాంకుల ద్వారా తాగునీటిని ఇంటింటికి సరఫరా చేసేందుకు కృషి చేస్తామన్నారు. గృహలకు విద్యుత్ ను సరఫరా చేసే కరెంట్ పోల్స్ దూరంగా ఉండి సర్వీస్ వైర్లు వేలాడుతున్నాయన్నారు.

ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు నూతన విద్యుత్ పోల్స్, మిడిల్, శిధిలమైన స్తంభాల స్థానంలో కొత్త పోల్స్ ఏర్పాటు చేస్తామని భీమారావు హామీ ఇచ్చారు. రైతులు పొలాలకు వెళ్ళే డొంక దారులు వర్షాకాలంలో నడవటానికి వీలులేకుండా ఉన్నాయని, అన్నదాతలు ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసే ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు బురదగా మారినా డొంకల్లో ప్రయాణించే పరిస్థితి లేదన్నారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ దృష్టికి తీసుకు వెళ్ళి రోడ్ల నిర్మాణం కోసం ప్రయత్నిస్తానన్నారు. రైతుల పొలాలకు సాగునీటిని అందించేందుకు పెద్దవాగుపై చెక్ డ్యాం, గ్రామంలో సైడ్ డ్రైనేజీలు, నూతన సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాలు, మౌలిక సదుపాయాలు కల్పనకు పనిచేస్తామన్నారు. కత్తెర గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను బోడ దుర్గా భీమారావు కోరారు.

Leave a Reply