Sarpanch | చీర్లవంచలో రేణుక రాజు అలజడి..

Sarpanch | చీర్లవంచలో రేణుక రాజు అలజడి..

  • ప్రచారంలో ప్రజా సందడియే!
  • ముఖ్య అతిథులుగా సింగర్ నక్క శ్రీకాంత్, సింగర్ నాగలక్ష్మ

Sarpanch | తంగళ్ళపల్లి, ఆంధ్రప్రభ : తంగళ్ళపల్లి మండలంలోని చీర్లవంచ గ్రామంలో సర్పంచ్ బరిలో ఉన్న వేల్పుల రేణుక రాజుని గెలిపించేందుకు గ్రామం మొత్తం ఒక్కటై ముందుకు వస్తోంది. గ్రామ సమస్యలు పరిష్కరించడంలో, అభివృద్ధి పనుల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకురాలిగా రేణుక రాజు ని ప్రజలు గుర్తిస్తున్న తరుణంలో ప్రచార యాత్ర జనాలను ఉత్సాహపరుస్తోంది.

ఈసందర్భంగా ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన ఫోక్ సింగర్ నక్క శ్రీకాంత్ యాదవ్, సింగర్ నాగలక్ష్మి చీర్లవంచ ప్రజల్లో ప్రచారానికి నూతన ఉత్సాహాన్ని నింపారు. తమ పాటల ద్వారా రేణుక రాజు గారి అభివృద్ధి సంకల్పాలను, గ్రామం కోసం ఆమె చేస్తున్న కృషిని ప్రజలకు వివరించారు. అదే విధంగా కౌన్సిలర్ బోల్గన్ నాగరాజు మాట్లాడుతూ… ప్రజలకు చేరువై పనిచేసే నాయకురాలు రేణుక రాజు మాత్రమేనని, అభివృద్ధి ప్రయాణం కొనసాగాలంటే ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రేణుక రాజు పై తమ అండతో, తమ ఆశతో ఉన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

గ్రామంలో ఇంటింట ప్రచారం జరుగుతుండగా, రేణుక రాజు అభ్యర్థిత్వానికి విశేష ఆదరణ లభిస్తోంది. అభివృద్ధి–సేవలను ప్రాధాన్యంగా ఉంచిన ఆమెకు మద్దతుగా ప్రజల్లో స్పష్టమైన జనతరంగం కనిపిస్తోంది. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో వేల్పుల రేణుక రాజు ను భారీ మెజార్టీతో గెలిపించి, చీర్లవంచ గ్రామ అభివృద్ధి పథాన్ని మరింత బలోపేతం చేయాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Leave a Reply