పారిశుధ్య కార్మికుల సేవలకు సన్మానం

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ ; గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు అందించే సేవలు వెలకట్టలేనివని, వారు అంకితభావంతో పనిచేస్తేనే గ్రామాలు ఆరోగ్యంగా,పరిశుభ్రంగా ఉంటాయని బడా భీమ్‌గల్‌ సర్పంచ్ రాచకొండ విష్ణువర్ధని శంకర్ గౌడ్ కొనియాడారు. శనివారం బడా భీమ్‌గల్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 9వ రోజు 99 రోజుల కార్యాచరణను పురస్కరించుకుని పారిశుధ్య కార్మికులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.​

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఎండనక, వాననక గ్రామాన్ని శుభ్రం చేసే కార్మికుల శ్రమను గుర్తించి, వారిని గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామంలో పరిశుభ్రత వెల్లివిరియడం వల్ల వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని, ప్రజల ఆరోగ్యంలో కార్మికుల పాత్ర కీలకమని కొనియాడారు.

99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్ధికి, పారిశుధ్య మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనంతరం పారిశుధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి, వారి సేవలను అభినందించారు.​ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మాండ్ర సుమన్, అరుణ్, గంగదాస్, మల్లెల శ్రీకాంత్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రజిత,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సురేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply