ఉద్యమ జ్వాల కేసీఆర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

ఉద్యమ జ్వాల కేసీఆర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

  • సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఉద్యమ జ్వాలతో తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన మహోన్నత నాయకుడు కేసీఆర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. సంకల్పమే ఆయుధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన దూరదృష్టి గల మహానుభావుడని కొనియాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యమానికి నాయకత్వం వహించి, తెలంగాణను దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలిపిన ఘనత కెసిఆర్ దేనని ఎమ్మెల్యే చింత ఈ సందర్భంగా పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, రైతు సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు సంక్షేమ-అభివృద్ధి సమన్వయాన్ని అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక నేత కేసీఆర్ అని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన ఈ మహానాయకుడు ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నామని ప్రకటించారు.

Leave a Reply