ఇసుక టిప్పర్ పట్టివేత… కేసు నమోదు

ఇసుక టిప్పర్ పట్టివేత… కేసు నమోదు
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా టిప్పర్ లో ఇసుక రవాణా చేస్తుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు టిప్పర్ పట్టుకొని పోలీస్ స్టేషన్, కు తరలించిన సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ లో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి ఊట్కూర్ ఎస్సై రమేష్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని తిప్రాస్ పల్లి గ్రామానికి చెందిన మక్తల్ రాజు శుక్రవారం అర్ధరాత్రి టిప్పర్ లో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారు.
పోలీసులు ఊట్కూర్ చెక్పోస్ట్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇసుక టిప్పర్ రావడంతో నిలిపి అనుమతి పత్రాలు అడగగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో టిప్పర్ పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక తరలించడం చట్టరీత్యా నేరమని అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
