Sammakka Sarakka | మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్..

Sammakka Sarakka | మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్..
Sammakka Sarakka, చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని వెంచరామి, కాల్వపల్లి గ్రామాల శివారు పూరేడు గుట్ట సమ్మక్క- సారాలమ్మ మినీ మేడారం జాతరలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం సాయంత్రం సారాలమ్మ చేరుకుంది. దీంతో భక్తులు మొక్కలు చెల్లించుకుంటున్నారు. ఈనెల 28 నుండి 31 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగనుంది.
కాగా పూరేడు గుట్ట మినీ మేడారం జాతరకు ప్రభుత్వం నుండి భక్తులకు అన్ని వసతులు కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వన దేవతలు ప్రజలను చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఇమామ్ బాబా ఎస్సై శ్రావణ్ కుమార్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, మాజీ జెడ్పిటీసీ పులి తిరుపతిరెడ్డి, కాల్వపల్లి గిద్ద ముత్తారం సర్పంచులు పులి అంజిరెడ్డి, బుర్ర చంద్రకళ రవీందర్, మేడారం జాతర కమిటీ, భక్తులు పాల్గొన్నారు.
