sammaiah | అవకాశం ఇవ్వండి.. అండగా ఉంటా

sammaiah | అవకాశం ఇవ్వండి.. అండగా ఉంటా

  • పాలకుడిగా కాదు.. సేవకుడిగా పరిపాలన చేస్తా..
  • నాగేపల్లి ప్రజాసేవ కోసం ముందుంటా
  • సమ్మయ్య సార్ కే మా మద్దతు అంటున్న ప్రజలు


sammaiah | మంథని, ఆంధ్రప్రభ : అవకాశం ఇవ్వండి.. అందుబాటులో ఉంటానని సర్పంచ్ అభ్యర్థి సమ్మయ్య తెలిపారు. మంథని మండలం నాగేపల్లి గ్రామంలో గుమ్మడి సమ్మయ్య గెలుపు దాదాపు ఖాయమైనట్లేనని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. ప్రచారంలో ఆయన రాకెట్ లా దూసుకెళ్తున్నారు. బ్యాటు గుర్తుకు ఓటెయ్యండి… బాధ్యతాయుతమైన పాలన అందిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. విద్యావంతుడైన గుమ్మడి సమ్మయ్య వైపే గ్రామస్తులు మొగ్గు చూపడం విశేషం.

ప్రజలంతా కలిసికట్టుగా ఆయన తరపున ప్రచారం చేయడం మరో విశేషం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన తర్వాత గ్రామాన్ని కోతుల బాధ నుండి తప్పించేందుకు ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. గ్రామంలో యువత, మహిళల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తానని ఆయన తెలిపారు. అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ చేసేందుకు ప్రయత్నం చేస్తానని ఆయన వివరించారు.

గ్రామంలో ప్రతి గడప గడపకు ఆయన ప్రచారం చేస్తూ ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళ్తున్నారు. ఎంతోమంది శిష్యులను తీర్చిదిద్ది ఉన్నత జీవితాలు ప్రసాదించిన గుమ్మడి సమ్మయ్య సార్ కే మా ఓటు అని ప్రజలు బహిరంగంగానే చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించండి.. ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన ప్రచారానికి ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు.

Leave a Reply