Saleguda Sarpanch | తనను గెలిపిస్తే…

Saleguda Sarpanch | తనను గెలిపిస్తే…

Saleguda Sarpanch | ఆసిఫాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : సాలెగూడా సర్పంచ్ గా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే.. సాలెగూడా గ్రామాన్ని అన్నిరంగాలలో ఉన్నతంగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి కుమ్రం వందన అన్నారు. సాలెగూడా గ్రామాంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే.. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లులు, పెన్షన్ లు ఇప్పించేందుకు కృషి చేస్తానని.. త్రాగు నీటి సమస్య, విద్యుత్ దీపాలు, సైడ్ డ్రైనేజీ నిర్మాణం రోడ్లు తదితర మౌలిక సమస్యలు పరిష్కారం కొరకు కృషి చేస్తానని.. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

Leave a Reply