Sale | సంతలో పందెం కోళ్ల‌ సందడి

Sale | సంతలో పందెం కోళ్ల‌ సందడి

  • జోరుగా విక్ర‌యాలు

Sale | పెడన, ఆంధ్రప్రభ : రానున్నసంక్రాంతి వేడుకల నేపథ్యంలో శుక్రవారం పెడనలోని వారాంత‌పు సంతలో పందెం కోళ్ల విక్రయం జోరుగా సాగింది. సంత ప్రాంతమంతా కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన పందెం రాయుళ్లు రకరకాల పుంజులను పరిశీలించి కొనుగోలు చేశారు. పందెం కోళ్ల‌ కోసం భారీగా నగదు వెచ్చించారు. కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతవాసులు కోడిపుంజులను పెంచి పందేల‌కు సిద్ధమవుతున్నారు. సంక్రాంతికి పందేలు వేసేందుకు ప్రత్యేకంగా షెడ్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు.

Leave a Reply