Sajjala | వ్యవస్థలు ఉండాలి..

Sajjala | వ్యవస్థలు ఉండాలి..
- సజ్జల రామకృష్ణారెడ్డి
Sajjala | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : వ్యవస్థలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కానీ రాష్ట్రంలో అలాంటి వ్యవస్థలు లేకుండా చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆగ్రహం కలిగిస్తున్నాయన్నారు. ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ ఏరకంగా దాడులు చేశారో అంతా చూశారన్నారు. అలాంటి క్రిమినల్స్ కు పోలీసులు రక్షణగా నిలిచారన్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేద్దామంటే ఎవరూ అందుబాటులోకి రాలేదన్నారు. దాడి బాధితుడు అంబటి రాంబాబునే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆగ్రహం కలిగిస్తున్నాయన్నారు. నియంతల తరహాలో అరాచకం సృష్టిస్తున్నారన్నారు. పోలీసులు చూస్తుండగానే దాడులకు పాల్పడుతున్నారన్నారు. జోగి రమేశ్ ఇంటికి వచ్చేందుకు ప్రయత్నించిన మా నేతలను అడ్డుకున్నారన్నారు. అసలు జోగి రమేశ్ ఇంటిపై దాడి చేసిన వారిలో ఎవరిపైనైనా కేసు పెట్టారా..? లోకేష్ కు బుర్ర పాడైదంటే.. కేసులు పెడుతున్నారన్నారు. దీన్ని బట్టి వారి అసహనం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. భవిష్యత్తులో చంద్రబాబుగారు అన్నా కేసులు పెడతారేమోనని అన్నారు. మాపై దాడులు చేసి తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారన్నారు.
