Sabari Peetham | శ్రీ అయ్యప్ప దేవాలయానికి దాతల సహకారం…
Sabari Peetham | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోనిశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయం శబరి పీఠం ఆవాసానికి మండల పరిధిలోని పెద్ద జట్రం గ్రామానికి చెందిన వడ్ల నరసింహులు వడ్ల వెంకటమ్మ కుమారుడు వడ్ల రాజ్ కుమార్ దాతలు ఈ రోజు దేవాలయానికి సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయ నిర్మాణంలో తమ కుటుంబాన్ని భాగస్వామ్యం చేసినందుకు మా కుటుంబానికి పుణ్యం దక్కిందని ఆయన అన్నారు. దైవకార్యంలో ఎవరైతే పాలుపంచుకుంటారో దైవం వారి వెంబడి ఉంటుందని, అయ్యప్ప సేవ చేయడం ద్వారా మాకు అన్ని రకాల సుఖ సంతోషాలు కలిగాయన్నారు. గతంలో కిటికీ రెక్కలు, ప్రస్తుతం రెండు జతల తలుపులను ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు భానుచందర్ వెంకట్ రాములు, ప్రవీణ్ తదితర స్వాములు పాల్గొన్నారు.

