Rural development | ఆదరించండి… అభివృద్ధి చేసి చూపిస్తా

Rural development | ఆదరించండి… అభివృద్ధి చేసి చూపిస్తా

  • బస్వాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి స్రవంతి శివరాజ్

Rural development | బంటారం, ఆంధ్రప్రభ : బంటారం మండలం బస్వాపూర్ గ్రామపంచాయతీ సర్పంచి అభ్యర్థిగా బీసీ మహిళను కేటాయించడంతో అక్కడ సర్పంచి అభ్యర్థిగా మంగలి స్రవంతి శివరాజ్ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా మంగలి స్రవంతి శివరాజ్ మాట్లాడుతూ… గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రణాళికా బద్ధంగా ప్రతి ఒక్కరినీ దృష్టిలో పెట్టుకొని గ్రామంలోని ప్రతి వార్డులో సమస్యలను తెలుసుకుంటాన‌న్నారు.

నిత్యం వార్డుల్లో తిరుగుతూ ప్రజలతో వారికి భరోసా కల్పించడానికి ముందుకు రావడం జరుగుతుందన్నారు. గ్రామాభివృద్దే(Rural development) ద్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా తనను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కోరారు.

Leave a Reply