RTC drivers | ఆర్టీసీ డ్రైవర్ల సేవలు గొప్పవి….

RTC drivers | ఆర్టీసీ డ్రైవర్ల సేవలు గొప్పవి….
RTC drivers | కామారెడ్డి, ఆంధ్రప్రభ : ఆర్టీసీ డ్రైవర్లు ప్రయాణికులకు అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని నిజామాబాద్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జ్యోత్స్న అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా కామారెడ్డి ఆర్టీసీ డిపోలో ఉత్తమ సేవలు అందిస్తున్న పలువురు డ్రైవర్లను సత్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడంలో ఆర్టీసీ డ్రైవర్లు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఎలాంటి ప్రమాదాలు లేకుండా గత 25 నుండి 30 సంవత్సరాలుగా ఎదుగు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లను ఆమె అభినందించారు. కార్యక్రమంలో కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ ,పలువురు అధికారులు ఉన్నారు.
