RTC depot | మున్సిపాలిటీ సుందరీకరణ లక్ష్యం

RTC depot | మున్సిపాలిటీ సుందరీకరణ లక్ష్యం

  • ఆర్టీసీ డిపో,బ్రిడ్జి ఏర్పాటు కి మంత్రులకు విన్నవించా
  • రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు
  • మున్సిపల్ విలీన గ్రామాల అభివృద్ధి బాధ్యత మాదే
  • తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్

RTC depot | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ సుందరీకరణ లక్ష్యమని, విలీన గ్రామాల బాధ్యత మాదేనని, రూ.30 కోట్ల(Rs.30 crore)తో అభివృద్ధి పనులు చేపట్టామని త్వరలోనే అన్ని పనులను ప్రారంభించి మోత్కూర్ మున్సిపాలిటీని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.

ఈ రోజు మున్సిపల్ కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ… మోత్కూర్ లో ఆర్టీసీ డిపో(RTC depot) ఏర్పాటు కోసం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్,ఈ డి వేణు లతో చర్చించినట్లు త్వరలోనే డిపో ఏర్పాటు కు కృషి చేస్తానన్నారు. మోత్కూర్ బిక్కేరు వాగు పై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం రోడ్ల, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి విన్నవించినట్లు మంత్రి సైతం సానుకూలంగా ఉన్నట్లు, త్వరలో బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు.

మున్సిపాలిటీ లో రూ.30 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరయ్యాయని,రూ.5 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణ దశలో ఉండగా, రూ.2.5 కోట్లతో అంబేద్కర్, జ్యోతి రావ్ పూలే పేరుతో స్టడీ సర్కిల్(study circle) ఏర్పాటు చేయనున్నట్లు, మినహా రూ.13 కోట్ల పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి 4,5 రోజుల్లో ఆయా పనులను ప్రారంభిస్తామన్నారు. జామాచెట్ల బావి నుండి కొండాపురం వరకు బి టి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశానని, త్వరలో రోడ్డు పనులు ప్రారంభిస్తామన్నారు.

మోత్కూర్ నుండి రాజన్నగూడెం వరకు మట్టి రోడ్డు పరిస్థితి ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసేందుకు అధికారులను ఆదేశించామన్నారు. మోత్కూర్ మినీ ట్యాంక్ బండ్ చెరువు కట్ట రోడ్డు కుంగిందని, రూ.1 కోటితో వేసవికాలంలో కట్ట మరమ్మతు పనులు పూర్తి చేస్తామన్నారు. పాల కేంద్రం నుండి పనక బండ వెళ్లే రూట్లో రోడ్డు గుంతల మయంగా మారిందని సీసీ నిర్మాణం చేపడుతామన్నారు.

స్థానిక వెంకటేశ్వర ఆలయం వరకు సీసీ నిర్మాణం తో పాటు, బుజిలాపురం లోని ఆలయంలో 500 మీటర్ల మేర సీసీ నిర్మాణం చేపట్టామన్నారు. గత ప్రభుత్వం లో కొండగడప, బుజిలా లపురం గ్రామలను విలీనం చేశారని, అభివృద్ధి కి నోచుకోని ఆ గ్రామాల అభివృద్ధి తమ బాధ్యతేనన్నారు. కొండగడప లో వడ్డెర లకు కమ్యూనిటీ హాల్ మంజూరు చేయిస్తామన్నారు.

ధర్మాపురం, రాజన్నగూడెం, ఇందిరానగర్, గాంధీ నగర్, జామాచెట్ల బావి, కొండాపురం లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తామన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో రెండేళ్ళ లో తాను రూ.3622 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వంగాల సత్యనారాయణ, గుండగొని రామచంద్రు, మార్కెట్ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వర్లు గౌడ్, జిల్లా నాయకులు అవిశెట్టి అవిలిమల్లు, చింతల విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, మహిళా నాయకులు అన్నెపు పద్మ, ప్రమీల, జయశ్రీ తదితరులు ఉన్నారు.

Leave a Reply