RTC buses | ఆర్టీసీ బస్సుల్లో స్వీట్ల పంపిణీ

RTC buses | ఆర్టీసీ బస్సుల్లో స్వీట్ల పంపిణీ
RTC buses | మోత్కూర్, ఆంధ్రప్రభ : జాతీయ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పుట్టినరోజు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆరు గ్యారంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం(Free bus facility) కల్పించి 2 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు ఆర్టీసీ బస్సుల్లో(RTC buses) ప్రయాణిస్తున్న మహిళలకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దo జయశ్రీ,అన్నేపు పద్మ, కుర్మిల ప్రమీల లు పాల్గొన్నారు.
