ఈనెల 27న శ్రీ సీతారాముల కళ్యాణం ఏర్పాట్లు పరిశీలన

ఈనెల 27న శ్రీ సీతారాముల కళ్యాణం ఏర్పాట్లు పరిశీలన

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంను ఈనెల 27వ తేదీన స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం ఏర్పాట్లను శుక్రవారం చౌటుప్పల్ పురపాలక చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, పురపాలక వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ లు పరిశీలించారు, స్థలంలో ఉన్న పిచ్చి మొక్కలను, చెత్తా చెదారం ను తొలగించి శుభ్రం చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.

శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంను ఘనంగా నిర్వహించాలని దేవాలయ కమిటీకి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి, కౌన్సిలర్లు దేప రమ్య రాజు, బద్రి గాలయ్య, ధర్మకర్తలు కామచెట్టి చంద్రశేఖర్, గుర్రం వెంకటేశం, తూర్పాటి నరసింహ, వరకాల రవి గౌడ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply