బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు ..

మక్తల్, (ఆంధ్రప్రభ): కర్ణాటకలోని రాయచూరు నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సు బైకును ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నల్లగట్టు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కర్ణాటకలోని దుప్పల్లి గ్రామానికి చెందిన హనుమంతు, ఆశమ్మ మోటార్‌సైకిల్‌పై తమ కుమారుడు మంజునాథ్‌తో కలిసి కర్ణాటకలోని బంధువుల ఇంటికి దేవసూర్ గ్రామానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా నల్లగట్టు వద్ద వెనుకవైపు నుండి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో హనుమంతు (45), ఆశమ్మ (42)లకు తీవ్ర గాయాలు అయ్యాయి. మంజునాథ్‌తో పాటు మూడేళ్ల బాలుడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై మాగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘటన సమయంలో అటువైపుగా వెళ్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య, జిల్లా నాయకులు కె. సోమశేఖర్ గౌడ్, రాజా గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ పోలీసులకు సమాచారం అందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply