RTC Bus | బస్సు ప్రమాదం…
RTC Bus | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఐ.యమ్.ఏ హాల్ రోడ్డు(I.M.A. Hall Road)లో ఐ.యమ్.ఏ హాల్ ముందు గురువారం ప్రమాదం తృటిలో తప్పింది.
మచిలీపట్నం నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు(RTC Bus) ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో, బస్సు నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న గొయ్యిలోకి దిగబడింది. అదృష్టవశాత్తు, పెద్ద ప్రమాదం ఏదీ జరుగకుండా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

