83 రోజుల్లో రూ. 81 లక్షలు
బాసర, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి(Basara Sri Gyan Saraswati Devi) అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ(Hundi) కానుకలను ఈ రోజు ఆలయ సాధారణ అక్షరాబ్యాస మండపంలో లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో నగదు ఎనభై ఒక్క లక్షల అరవై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు. (81,69,099)
మిశ్రమ బంగారం 91గ్రాముల 500 మిల్లీ గ్రాములు, మిశ్రమ వెండి 3కిలోల 500 గ్రాములు, విదేశీ కరెన్సీ 79 నోట్లు వచ్చాయని, ఈ ఆదాయం ఆలయానికి 83 రోజుల్లో సమకూరినట్లు ఆలయ ఈఓ అంజనీదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శరత్ పాటక్(Sharath Pathak), ఏఈఓ సుదర్శన్ గౌడ్, సూపరింటెండెంట్ శివరాజ్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, బాసర పోలీసు, దేవస్థాన హోం గార్డ్స్ వాగ్దేవి సొసైటి సభ్యులు, శ్రీ రాజరాజేశ్వర(Sri Rajarajeshwara) సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.