Rs.70 lakhs | బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చి….

Rs.70 lakhs | బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చి….

Rs.70 lakhs | ఏలూరు, ఆంధ్రప్రభ : పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీల దేవి ఇంట్లో ఈ రోజు చోరీ జ‌రిగిన ఘ‌ట‌న చోటు చేసుకుంది. చింతలపూడిలోని ప్రమీలాదేవి ఇంట్లో రూ.70 లక్షలు విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ చోరీకి పాల్ప‌డిన ఏలూరు జిల్లా పెద‌పాడుకు చెందిన రాజేష్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు పోలీసుల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పొన్నూరు పోలీసులు తెలిపారు.

ఒంగోలులో వాలీబాల్ ఆడేందుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడు రాజేష్‌పై పెద‌పాడు పోలీస్ స్టేష‌న్‌లో ప‌లు కేసులు న‌మోదైన‌ట్లు తెలుస్తోంది. ఓ కేసులో నాలుగు రోజుల క్రిత‌మే రాజేష్ జైలు నుంచి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 10 కేజీల వెండిని స్వాధీనం చేసుకోగా కొంత బంగారం విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ఆభరణాలను ఏలూరులోని ఓ వైసీపీ సర్పంచ్ ఇంట్లో పెట్టినట్లు విచారణలో గుర్తించారు.

Rs.70 lakhs |

చోరీ సొత్తు అమ్మకంలో కీలకంగా వ్యవహరించిన ఓ వైసీపీ సర్పంచ్‌ను, ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామ వైసీపీ సర్పంచి గుడిపూడి రఘును సైతం అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఓ YCP సర్పంచ్ ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసుల నుంచి స‌మాచారం…

Rs.70 lakhs |

Leave a Reply