హెక్టారుకు రూ.50వేలు జమ
- రూ.1200 లు మద్దతు ధర అమలులో ఉండదు
- ఎక్కడ ధర లభిస్తే.. అక్కడ అమ్ముకోవచ్చు
- ఆదివారం కర్నూలు మార్కెట్ యార్డ్ కు సెలవు
- జాయింట్ కలెక్టర్ డాక్టర్ బీ.నవ్య
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా ఉల్లి రైతుల(Onion farmers)కు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, జిల్లాలోని ఉల్లి రైతులకు హెక్టారు(hectares)కు రూ. 50 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్ల(bank accounts)లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బీ.నవ్య(Collector Dr. B. Navya) తెలిపారు.
సోమవారం నుంచి రూ.1200 లు మద్దతు ధర అమలులో ఉండదని, రైతులు కళ్ళాల్లో కాని, లోకల్ ట్రేడర్స్ దగ్గర, ఇతర మార్కెట్లలో(markets) కాని, తమ ఉల్లి పంటకు ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చని జాయింట్ కలెక్టర్ తెలిపారు. మార్కెట్ యార్డ్(yard)లో అమ్ముడుపోని ఉల్లిని రైతులు తీసుకువెళ్లి ఎక్కడైనా అమ్ముకోవచ్చని జాయింట్ కలెక్టర్(Joint Collector) తెలిపారు.
భారీ వర్షాలు లేదా వరదలు వస్తే విపత్తు సాయంగా హెక్టార్‌కు రూ.25 వేలు మాత్రమే మంజూరు చేస్తారు, కానీ ప్రస్తుతం ఉల్లి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి(Chief Minister) రెట్టింపు మొత్తంతో హెక్టార్‌కు రూ. 50 వేల ఆర్థిక సహాయాన్నిప్రకటించారు. సోమవారం నుంచి మార్కెట్ యార్డ్ లో ఉల్లి క్రయవిక్రయాలు(sales) ట్రేడర్స్ ద్వారా జరుగుతాయని, పీడీఎస్ సిస్టం(PDS system) అమలులో ఉండదని, మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు ఉండదని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఆదివారం కర్నూలు మార్కెట్ యార్డ్ కు(market yard) సెలవు ప్రకటించారని, రైతులు ఈ విషయాన్నిగమనించి, మార్కెట్ యార్డ్ కు ఉల్లి తీసుకురావద్దని జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

