మృతుల కుటుంబాలకు రూ 5 లక్షలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కర్నూలు (Kurnool) శివారులోని చిన్నటేకూరు వద్ద బస్సు దగ్ధమైన సంఘటనలో సజీవ దహనమైన మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ సంఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తెలంగాణ సర్కార్ రూ.ఐదు లక్షలు, అదే విధంగా క్షతగాత్రులకు రెండు లక్షల పరిహారం ప్రకటించినట్లుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.

