Digital Arrest | డిజిటల్ అరెస్ట్ అంటూ రూ.42 లక్షల మోసం

Digital Arrest | డిజిటల్ అరెస్ట్ అంటూ రూ.42 లక్షల మోసం

  • నలుగురు సైబర్ నిందితుల అరెస్ట్

గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : డిజిటల్ అరెస్ట్ అనే పదమే చట్టంలో లేదు. అయినా అనేక మంది అమాయకులు ఆ వలలో చిక్కుకుని లక్షలు పోగొట్టుకుంటున్నారు. గుంటూరు జిల్లా కాకానికి చెందిన ఓ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయని సైబర్ నేరగాళ్లు రూ.42 లక్షలకు మోసం చేశారు. అయితే పోలీసులు చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేశారు. సంఘటన వివరాల్లోకి వెళ్తే..

Digital Arrest | రిటైర్మెంట్ బెనిఫిట్స్ బ్యాంకులో ఉంటే..

కాకుమాను మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన మోపర్తి మేరీ మంజుల వాణి (రిటైర్డ్ హెడ్ మాస్టర్) తన ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన నగదు, పెన్షన్ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో ఉంచుకున్నారు. పెద్ద మొత్తం బ్యాంక్ అకౌంట్ లో ఉన్నది గుర్తించిన సైబర్ కేటుగాళ్లు అక్టోబర్ 23న గుర్తు తెలియని నంబర్ నుంచి ముంబై సీ ఐ డీ అధికారులమని చెప్పి ఫోన్ చేశారు. మానవ అక్రమ రవాణా కేసులో మీ పేరు ఉందని, “డిజిటల్ అరెస్ట్”లో ఉన్నారని బెదిరించారు.

ఈ కేసు చాలా తీవ్రమైందని… తప్పించుకోవడం కష్టమని కేటుగాళ్లు మానసిక వత్తిడికి గురి చేశారు. ఐదు రోజుల పాటు ఇదే ఒత్తిడి తేవడంతో భయాందోళనకు గురైన బాధితురాలు రెండు విడతలుగా మొత్తం రూ.42 లక్షలను నిందితులు చెప్పిన అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు.

Digital Arrest | మోసం అని గ్రహించి…

జరిగిన విషయాన్ని నలుగురికీ చెప్పిన మంజుల అదంతా అబద్ధమని.. పోలీసు కేసు పెట్టమని నలుగురు చెప్పడంతో మోసపోయానని గ్రహించి కాకుమను పోలీసులను నవంబర్ 7న ఆశ్రయించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు Cr.No.90/2025 కింద BNS సెక్షన్లు 318(4), 114(4), ఐటీ యాక్ట్ 66(D) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

DCP Dharakavita | తప్పుడు ఫిర్యాదులు చేస్తే ఇక కేసులే..

ఛేదించిన పోలీసులు…

ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, ఎస్సై ఏకనాథ్ సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో రూ.42 లక్షల్లో రూ.22 లక్షలు విశాఖపట్నానికి చెందిన ఇంద్రప్రస్థ హాస్పిటల్ డైరెక్టర్ మరపు సురేష్ నాయుడు అకౌంట్‌కు వెళ్లినట్లు గుర్తించారు. ఆ అకౌంట్‌ను మ్యూల్ అకౌంట్‌గా ఉపయోగించి కమిషన్ కోసం అక్రమ లావాదేవీలకు పాల్పడ్డట్లు తేలింది.

హిందూపురం, నెల్లూరు, కాకినాడ, ఆగ్రా ప్రాంతాలకు చెందిన పలువురు నిందితులు కలిసి ఈ మోసానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. ఇండోర్, జైపూర్ ప్రాంతాలకు వెళ్లి డబ్బును వివిధ అకౌంట్లకు బదిలీ చేసినట్లు కూడా ధ్రువీకరించుకున్నారు.

ఈ కేసులో మ్యూల్ అకౌంట్లు సమకూర్చిన ముగ్గురు, కమిషన్ ఇప్పించే ఒకరిని కలిపి మొత్తం నలుగురిని శుక్రవారం ఉదయం విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు, రూ.50 వేల నగదు, కార్పొరేట్ అకౌంట్ కిట్‌ను సీజ్ చేశారు.

Murder @ 10  ₹ : బెజవాడలో దారుణం 

డిజిటల్ అరెస్ట్ అన్న పదమే లేదు..

కాగా శుక్రవారం గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ ఈ విషయం మీద మీడియా సమావేశం పెట్టారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అన్న పదమే లేదని తేల్చి చెప్పారు. ఈ మోసానికి ఉపయోగించిన పలుచోట్ల ఫోన్ నంబర్లు కంబోడియాకు చెందినవిగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. విదేశాల నుంచి ఈ తరహా సైబర్ నేరాలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు.

ప్రజలు “డిజిటల్ అరెస్ట్” పేరిట వచ్చే ఫోన్ కాల్స్‌కు భయపడకూడదని, పోలీస్ లేదా ప్రభుత్వ అధికారులు ఎవరూ ఫోన్ ద్వారా అరెస్ట్ చేయరని ఎస్పీ హితవు పలికారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కేసులో సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టిన సౌత్ డీఎస్పీ భానోదయ, ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, ఐటీ కోర్ సీఐ నిస్సార్ బాషతో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.

Leave a Reply