Rs.4.5 cr | నోటీసులు కూడా ఇచ్చారు…

Rs.4.5 cr | నోటీసులు కూడా ఇచ్చారు…
Rs.4.5 cr | గన్నవరం – ఆంధ్రప్రభ : గన్నవరం నియోజకవర్గ ముఖచిత్రాన్ని మార్చడమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ స్పష్టం చేశారు. బుద్దవరం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీలో పాల్గొని ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దశాబ్దకాలంగా గన్నవరం, బుద్దవరం, కేసరపల్లి ప్రాంతాల్లో ప్రజలను వేధిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపానని తెలిపారు.
ప్రత్యేక వాహనం ను కొనుగోలు చేసి, పేరుకుపోయిన చెత్తను గుంటూరు జిందాల్ ప్లాంట్‌కు తరలించడం ద్వారా ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కాలుష్యానికి అడ్డుకట్ట వేశామని వివరించారు. విజయవాడ రూరల్ మండల పరిధిలోని రామవరప్పాడు వంటి పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం వల్ల పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రామవరప్పాడు పంచాయతీలో దాదాపు రూ. 4.5 కోట్లు దోచుకున్నారని, దీనిపై ఇప్పటికే అధికారులు నోటీసులు కూడా ఇచ్చారని పేర్కొన్నారు.

ఈ సమస్యల పరిష్కారానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో రామవరప్పాడు తో పాటు మరో 8 గ్రామాలను విలీనం చేయాలని ముఖ్యమంత్రిని కోరానని, తెలిపారు. కృష్ణా యూనివర్సిటీకి నైనవరం లో స్థలం కేటాయింపు వేగవంతం చేయాలని అసెంబ్లీలో కోరినట్లు వెల్లడించారు. అలాగే సి డాక్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపానని, కేంద్ర ప్రభుత్వం రూ. 200 కోట్ల పెట్టుబడితో ముందుకు వస్తె స్థానిక యువతకు ఐటీ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, తన పదవీ కాలం ముగిసేలోపు నియోజకవర్గ దశ-దిశ మారుస్తానని యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గన్నవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, బుద్ధవరం గ్రామ టీడీపీ అధ్యక్షులు బొప్పూడి ప్రవీణ్, బుద్ధవరం పి.ఏ.సి.ఎస్ అధ్యక్షులు ముద్రబోయిన శ్రీనివాసరావు, మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ నాయకులు కంభంపాటి లక్ష్మీ నరసమ్మ, జొన్నలగడ్డ సుధాకర్, గొంది నరేంద్ర, బోడపాటి రవి, గొంది శివ, కారంపూడి సాంబశివరావు, మేడేపల్లి రమ, పాలడుగు నాని, కొమ్మురాజు సుధీర్, అన్నే హరికృష్ణ, షేక్ కరీముల్లా, కోసూరి వెంకటేష్, బేతాళ ఈశ్వర్, నక్క ఆదినారాయణ, తల్లిబోయిన అంకాలు, చోడవరపు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
