Rs. 35 thousand | సర్పంచ్ మానవీయత ..

Rs. 35 thousand | సర్పంచ్ మానవీయత ..
- బాధిత గిరిజన కుటుంబానికి రూ.35వేల ఆర్థిక సహాయం
Rs. 35 thousand | కన్నెపల్లి, ఆంధ్రప్రభ : కన్నెపల్లి రెబ్బన గ్రామంలో హఠాత్తు(suddenly)గా ఓ నిరుపేద గిరిజనుడు మృతిచెందగా విషయం తెలుసుకున్న నూతన సర్పంచ్ గవ్వలరవి మృతుని ఇంటికి వెళ్లారు. మృతుని తల్లి బోరె గట్టక్క తండ్రి, బోరెచీకటిలను కలిసి వారి కొడుకు బోరె అంజి ఎలా చనిపోయాడు, ఆ కుటుంబం పరిస్థితి ఏంటని తెలుసుకున్నాడు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న యుక్త వయసు గల కొడుకు అంజి హఠాత్తుగా ఎలా చనిపోయడంటూ సర్పంచ్ ఆ గిరిజన కుటుంబం పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
తమకు పెద్దదిక్కుగా ఉన్న ఒక్క గానోక్క కొడుకు చనిపోవడంతో తమకు దిక్కు ఎవరంటూ ఆ కుటుంబం కన్నీళ్ల పర్యంతమైంది. ఇందుకు చలించిన సర్పంచ్ గువ్వల రవి దాతల సహాకారంతో రూ.35వేలు(Rs. 35 thousand) అప్పటికప్పుడు ఆకుటుంంబానికి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అంతే కాదు కుటుంబానికి అండగా ఉంటాను.. అధైర్య పడవద్దు.. అంటూ భరోసా ఇచ్చారు. అచేతన స్థితిలో ఉన్న(కోలావార్ )గిరిజన నిరుపేద కుటుంబంకు ఆర్ధిక సహాయం అందజేసి ఆ కుటుంబం కన్నీళ్లు తుడిచారు.
భవిష్యత్తులో కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని వారికి భరోసా ఇచ్చాడు. కాగా సర్పంచ్ వెంట బీఆర్ఎస్ నాయకులు గట్టు ప్రమోద్ గౌడ్, వార్డు సభ్యులు ఒడేటి పావనివిజయ్, ఒల్లాల మహేష్, గట్టు రాజగౌడ్, మేకర్తి మల్లయ్య, పాయిలి అంజయ్య, మానేపల్లి మల్లేష్, వెంకటేష్, పి.లక్ష్మణ్, తోడే మోహన్, పి. ప్రభాకర్, జే.స్వామి నారాయణ రెడ్డి, గ్రామ పెద్దలు, పలువురు యువకులు తదితరులున్నారు.
