
Rs. 35 thousand | కొత్త సర్పంచ్ ఉదారత
Rs. 35 thousand | కొత్త సర్పంచ్ ఉదారత
- బాధిత గిరిజన కుటుంబానికి రూ.35 వేల ఆర్థిక సాయం
Rs. 35 thousand | కన్నెపల్లి, ఆంధ్రప్రభ : కన్నెపల్లి రెబ్బన గ్రామంలో ఓ నిరుపేద గిరిజనుడు మృతి చెందిన విషయం తెలుసుకొని కొత్తగా సర్పంచ్ ఎన్నిక (election)అయిన గవ్వల రవి మానవీయత చాటుకున్నారు. మృతుని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న అంజి హఠాత్తుగా ఎలా చనిపోయాడని తెలుసుకొని ఉదారత చాటుకున్నారు. సర్పంచ్ గువ్వల రవి దాతల సహకారంతో రూ.35 వేల(Rs. 35 thousand) ఆర్థిక సాయం మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.
సర్పంచ్ వెంట బీఆర్ఎస్ నాయకులు గట్టు ప్రమోద్ గౌడ్, వార్డు సభ్యులు ఒడేటి పావనివిజయ్, ఒల్లాల మహేష్, గట్టు రాజగౌడ్, మేకర్తి మల్లయ్య, పాయిలి అంజయ్య, మానేపల్లి మల్లేష్, వెంకటేష్, పి.లక్ష్మణ్, తోడే మోహన్, పి. ప్రభాకర్, జే. స్వామి నారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు.
