Rs. 203 crores | ఆయన అంటే ఓ మార్పు

Rs. 203 crores | ఆయన అంటే ఓ మార్పు
- మంత్రి శ్రీధర్ బాబు చొరవతో రెండు జిల్లాల మధ్య అనుసంధాన బ్రిడ్జి
Rs. 203 crores | మంథని, ఆంధ్రప్రభ : మంత్రి శ్రీధర్ బాబు అభివృద్ధి ప్రధాత అనడంలో సందేహమే లేదని మంథని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) చొరవతో పెద్దపెల్లి, భూపాలపల్లి జిల్లాలో కలుపుతూ అనుసంధానంగా బ్రిడ్జి నిర్మాణానికి సుమారుగా రూ. 203 కోట్లు(Rs. 203 crores) మంజూరు అయినట్లు మంత్రి క్యాంపు కార్యాలయం ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మంథని మండలం మానేరుపై ఆరెంద మీదుగా దామెరకుంట వరకు హై లెవెల్ బ్రిడ్జి(High Level Bridge) నిర్మాణానికి, ఆరెంద, మల్లారం, వెంకటాపూర్ నుండి బ్రిడ్జి వరకు రోడ్డు దామరకుంట రోడ్డు వరకు, అప్రోచ్ రోడ్డు కమ్ రోడ్డుకు భారీగా నిధుల మంజూరు పట్ల నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా, ఇతర మండలాల ప్రజలు మానేరు బ్రిడ్జి దాటి ఇతర జిల్లాలకు, మహారాష్ట్రకు, కాలేశ్వరం దేవాలయానికి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి, ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి వీలుగా బ్రిడ్జి నిర్మాణం చేయాలని సంకల్పించి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆరెంద మీదుగా దామెరకుంట వరకు ఆర్ అండ్ బి శాఖ నుండి 203 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం(Bridge Construction) వలన మంథని, పెద్దపల్లి జిల్లా వారికి కాలేశ్వరం వెళ్ళడానికి 25 కిలోమీటర్ల వరకు దూరం తగ్గుతుందని, కాలేశ్వరం టూరిజం డెవలప్మెంట్ కూడా పెరుగుతుందని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్ర ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి, జయశంకర్ భూపాలపల్లి కాటారం వెళ్లడానికి వీలు ఉంటుందని, ఆరెంద, మల్లారం, వెంకటాపూర్, దామేరకుంట ఈ గ్రామాలలో ప్రజలకు రవాణా(Transport) పరంగా, వైద్య, విద్య పరంగా చాలా ఉపయోగపడుతుందిని ప్రజలు చర్చించుకుంటున్నారు. మానేరు పై బ్రిడ్జి అరెంద మీదుగా దామెర కుంట నిర్మాణానికి 203 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు పెద్దపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
