సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి అందజేత..

సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి అందజేత..

విజయవాడ, ఆంధ్రప్రభ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సహాయం కోసం తన వద్దకు వచ్చిన ఓ మహిళ కుటుంబానికి ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని) అండగా నిలిచారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వన్ టౌన్ ప్రాంతానికి చెందిన పిళ్ళ రమణమ్మ అనే మహిళ నడుము, భుజం సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ అవసరం నిమిత్తం ఆర్థిక సాయం కోరుతూ ఎంపీ కార్యాలయాన్ని ఆశ్రయించింది.

మహిళకు ఆపరేషన్ నిమిత్తం అవసరమయ్యే నిధుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎంపీ కేశినేని చిన్నిలేఖ రాశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 1,00,851 నగదు పత్రం ఎల్ఓసి మంజూరు కాగా సంబంధిత పత్రాన్ని మహిళ కుటుంబ సభ్యులకు గురు నానక్ కాలనీలోని తన కార్యాలయంలో ఎంపీ చిన్ని ఆదివారం అందజేశారు. ఆపదలో ఉన్నటువంటి రోగులకు కూటమి ప్రభుత్వంలోని సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంలో ఎంపీ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిళ్ళ శ్రీనివాసరావు, పరిసపోగు రాజేష్, సోలంకి రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply