Rs. 10 lakh | జీవనాధారం గల్లంతు చేసిన దొంగలు
- పాములపర్తిలో 8 గేదెలు మాయం… రూ.10 లక్షల నష్టం..
Rs. 10 lakh | మర్కుక్, ఆంధ్రప్రభ : మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో చోటుచేసుకున్న దొంగతనం సంఘటన ఓ పేద రైతు కుటుంబాన్ని కన్నీళ్ల పాలు చేసింది. రాత్రి వేళలో గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ శివారులో ఉన్న పశువుల గదిలో నుంచి ఎనిమిది గేదెలను అపహరించడంతో సుమారు రూ.10 లక్షల(Rs. 10 lakh) విలువైన ఆస్తి గల్లంతైంది.

పశుపోషణే ప్రధాన జీవనాధారంగా జీవిస్తున్న ఒగ్గు లక్ష్మణ్ కుటుంబం, రోజువారీ కష్టంతో పశువులను పెంచుకుంటూ జీవనం సాగిస్తోంది. ఒక్క రాత్రిలోనే తమ జీవనాధారం మాయమవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన, ఆవేదనకు గురయ్యారు. గేదెల పాల అమ్మకాల(sales)పై ఆధారపడి కుటుంబ ఖర్చులు, పిల్లల చదువు, అప్పుల చెల్లింపులు జరుగుతున్నాయని బాధితులు వాపోయారు.
ఈ రోజు ఉదయం గేదెలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు(police) ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఇటీవల పశువుల దొంగతనాలు పెరుగుతున్నాయని, రాత్రివేళ గస్తీ పెంచాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ప్రభుత్వం(government), పోలీస్ శాఖ స్పందించి నిందితులను త్వరగా పట్టుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పశువులే జీవనాధారంగా ఉన్న రైతులకు ఇటువంటి ఘటనలు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

