కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి…

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి…

కడెం(నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్ అన్నారు. సోమవారం కడెం మండలంలోని ఎలగడప గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న జిపి కార్యాలయం భవనం పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న ఐకెపి వివో భవనం రూ.10 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న అంగన్వాడీ భవనం నిర్మాణం పనులను ఎలగడప గ్రామ సర్పంచ్ నర్సింగ్ అశ్విత రమేష్ ఉప సర్పంచ్ రాపర్తి శ్రీనివాస్ జిపి వార్డు సభ్యులుతో కలిసి పై నిర్మాణం పనుల భూమి పూజ చేసి ఏం సి చైర్మన్ భూషణ్ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధికారంలోకి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలలో అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి బి నరేష్ కుమార్, జిపి వార్డు సభ్యులు కె భారతి, తొడిశెట్టి లక్ష్మీ రాజం, నాంపల్లి భాగ్యలక్ష్మి, ఏపూరి రాజ్ కుమార్, మునేసుల గంగు, వంగ భాగ్యలక్ష్మి, రామగిరి నరసయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జి మల్లేష్ యాదవ్, మొహమ్మద్, సలీం అబ్దుల్, రహీం, నాంపల్లి భూమ రాజాం, ఆకుల లచ్చన్న, కమలాకర్, రాపర్తి నరసయ్య, మాజీ సర్పంచ్ ఆగునూరి సత్యమ్మ, గంగన్న, మాజీ ఉపసర్పంచ్ బీగాల చంద్రశేఖర్, స్థానిక పాఠశాల హెచ్ఎం కూచనపల్లి శ్రీనివాస్, ఈజీఎస్ ఎఫ్ఏ వసంత శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్ రత్నమాల, స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, డాక్రా మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply