Rs. 1.75 crores | రూ.1.75 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

Rs. 1.75 crores | రూ.1.75 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
- టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలజగ్గారెడ్డి
Rs. 1.75 crores | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఐఐసీ) చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఈ రోజు ప్రారంభించారు. పట్టణంలోని వివిధ కాలనీల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, డంబర్ రోడ్లు, బీటీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు మొత్తం రూ.1 కోటి 75 లక్షల(Rs. 1 crore 75 lakhs) వ్యయంతో చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సంగారెడ్డి గంజిలో రూ.15 లక్షలతో డంబార్ రోడ్డు, బైపాస్ సన్రైస్ హాస్పిటల్ వద్ద ఎన్‌క్యాప్ నిధులతో రూ.50 లక్షలతో బీటీ రోడ్డు, రాజీవ్ పార్క్ ముందు రూ.25 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. అలాగే 12వ వార్డులో రూ.10 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైన్(underground drain), 33వ వార్డులో రూ.18 లక్షలతో మురికి కాల్వ, 31వ వార్డులో రూ.10 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు వివరించారు.
పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకువెళ్తోందని పేర్కొన్న నిర్మలా జగ్గారెడ్డి, సంగారెడ్డి అభివృద్ధికి అవసరమైన నిధులు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సహకరించిన జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహకు, ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూ, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, బొంగుల రవి, షఫీ, కసిని రాజు, నవాజ్, సోహీల్, మహేష్, ప్రదీప్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
