ఐపీఎల్ 2025లో భాగంగా నేడు జైపూర్ వేదికగా రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో.. ఆర్సీబీ రెచ్చిపోయి ఆడుతోంది. ఆర్ఆర్ నిర్దేశించిన 174 పరుగుల టార్గెట్ ఛేదనలో.. బెంగళూరు బ్యాటర్లు దూకుడుగా ప్రారంభించారు. సిక్సులు ఫోర్లతో పవర్ ప్లే లో దంచికొట్టారు.
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు జైపూర్ వేదికగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో.. ఆర్‌సీబీ రెచ్చిపోయి ఆడుతోంది. ఆర్ఆర్ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. బెంగళూరు బ్యాటర్లు ఇన్నింగ్స్ ను దూకుడుగా ప్రారంభించారు. పవర్ ప్లేలో ఫోర్లు, సిక్స్‌లతో దంచికొట్టారు.
ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (23 బంతుల్లో 4ఫోర్లు, 4 సిక్సులు 46), విరాట్ కోహ్లీ (13 బంతుల్లో 2 ఫోర్లు 18) పరుగులు సాధించారు. పవర్ ప్లే అనంతరం రాజస్థాన్ స్పిన్ బౌలింగ్ దించగా.. ఆర్సీబీ ఓపెనర్లు ఏమాత్రం తగ్గకుండా విరుచుకుపడ్డారు. ఈక్రమంలో 7.2వ ఓవర్లో 28 బంతుల్లో ఫిలిప్ సాల్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు.
అయితే, ఆ తరువాత కూడా సిక్సులు, ఫోర్లతో చెలరేగిన సాల్ట్ (33 బంతుల్లో 65)… 8.4వ ఓవర్లో కుమార్ కార్తికేయ బౌలింగ్ లో బౌండరీ వద్ద క్యాచ్ ఔటయ్యాదు. కాగా, సాల్ట్ – కోహ్లీ కలిసి తొలి వికెట్ కు 52 బంతుల్లో 92 పరుగులు జోడించారు.
సాల్ట్ అవుట్ అయిన తర్వాత దేవదత్ పడిక్కల్ క్రీజులోకి వచ్చి ఆర్‌సిబి జోరును కొనసాగించాడు. దీంతో 10 ఓవర్లకు బెంగళూరు జట్టు వికెట్ నష్టానికి 101 పరుగులు సాధించింది.