RR vs GT | గుజ‌రాత్ తో కీల‌క పోరు.. టాస్ గెలిచిన రాజ‌స్థాన్ !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో భాగంగా నేడు మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కు వేదిక సిద్ధమైంది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో గుజరాత్ టైటాన్స్ జట్టు తలపడనుంది. తమ సొంత మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

దీంతో గిల్ నేతృత్వంలోని గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. కాగా, ఈ సీజన్‌లో అత్యంత విజయవంతమైన జట్ట‌లో ఒక‌టిగా కొనసాగుతున్న గుజరాత్ ఈరోజు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.

తుది జ‌ట్లు :

గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీప‌ర్), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, కరీం జనత్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

గుజరాత్ టైటాన్స్: షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ స్థానంలో తుది జ‌ట్టులోకి కరీం జనత్ ఎంట్రీ ఇచ్చాడు.

రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్ట‌న్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, యుధ్వీర్ సింగ్.

ఇంపాక్ట్ ప్లేయర్స్ :

గుజరాత్ టైటాన్స్: అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, దసున్ షనక
రాజస్థాన్ రాయల్స్: శుభమ్ దూబే, కునాల్ సింగ్ రాథోడ్, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, తుషార్ దేశ్‌పాండే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *