రైతాంగాన్ని ఆదుకోవాలి

నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట (Narsampet) మండలంలోని మాదన్నపేటలో అకాల వర్షాలతో ప‌త్తి, మొక్క‌జొన్న పంట‌ల‌కు తీవ్రంగా న‌ష్టం ఏర్ప‌డింద‌ని, రైతాంగాన్ని ఆదుకోవాలని ఎంసీపీఐ (యు) నేతలు వంగాల రాగ సుధ, నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, ఏఐకేఎఫ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కేశెట్టి సదానందం డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పత్తి పంటపై పెట్టిన పెట్టుబడి రాలేని దుస్థితిలో ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో రైతు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ఎకరాకు 25 వేల రూపాయల చొప్పున ప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్ (demand) చేశారు.

తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేసి గ్రామానికి ఒక అధికారిని నియమించి పంట నష్టం పై సర్వే చేసి నివేదిక‌ల‌ను త‌యారు చేయాల‌ని కోరారు. లేకుంటే రైతాంగాన్ని సమీకరించి ఆందోళన చేప‌డ‌తామ‌ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదన్నపేట గ్రామ పార్టీ కార్యదర్శి అనుమాల రమేష్, కందికొండ సాంబయ్య, గుర్రం రవి,ఆకుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply