బాలుడు మృతి

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో విషాదం నెలకొంది. డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 8 ఏళ్ల రోషన్ పాలపిట్ట (Roshan Palapitta) ప్రాణాలు కోల్పోయాడు.

ఎర్రబాడు గ్రామానికి చెందిన షెక్షావలి, హసీన దంపతులు ప్రస్తుతం కోడుమూరులో నివాసం ఉంటున్నారు. వీరి మొదటి సంతానం రోషన్ డెంగ్యూ జ్వరంతో కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స పొందుతున్నప్పటికీ పరిస్థితి విషమించి గురువారం ఉదయం మృతి చెందాడు. రోషన్ మరణం గ్రామాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్నారి మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.శాఖ అధికారులు గ్రామంలో పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

Leave a Reply