ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నేటి మ్యాచ్ కు దూరమయ్యాడు. ఈరోజు మ్యాచ్ కు ముందు నెట్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ కాలికి గాయం అయింది. ఈ కారణంగా, ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌కు… రోహిత్‌ను ముంబై ప్లేయింగ్ ఎలవెన్ లో చేర్చలేదు.
ఈ సీజన్ ఐపీఎల్ లో రోహిత్ పేలవ ప్రదర్శన పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రోహిత్ శర్మ మూడు ఇన్నింగ్స్ లలో కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన రోహిత్.. ఎంతకాలం మ్యాచ్‌లకు దూరం కానున్నాడనేదానిపై క్లారిటీ లేదు.
డెబ్యూట్ అలర్ట్ !
ఈరోజు లక్నోతో జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున రాజ్ అంగద్ బావా అరంగేట్రం చేయనున్నాడు. తిలక్ వర్మ స్థానంలో రాజ్ అంగద్ బావా తుది జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా, ఆకాష్ దీప్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అరంగేట్రం చేయనున్నాడు. రవి బిష్ణోయ్ స్థానంలో ఆకాష్ దీప్ తుది జట్టులోకి వచ్చాడు.
ముంబై ప్లేయింట్ ఎలవెన్ : విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాజ్ అంగద్ బావా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్, అశ్వనీ కుమార్.
ఇంపాక్ట్ ప్లేయర్స్ : ముంబై ఇండియన్స్: తిలక్ వర్మ, రాబిన్ మింజ్, కార్బిన్ బాష్, కర్ణ్ శర్మ, సత్యనారాయణ రాజు.