కోతకు గురైన బీటీ రోడ్డు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

కోతకు గురైన బీటీ రోడ్డు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
తక్షణమే మరమ్మతులు చేయాలని కమిషనర్ కి ఆదేశాలు
మోత్కూర్, ఆంధ్రప్రభః మున్సిపల్ కేంద్రంలో ని ఆరేగుడెం రూట్లో ప్రభుత్వ జూనియర్ కళశాల సమీపంలో గత వర్షాకాలంలో అధిక వర్షాలకు బి టి రోడ్డు కోతకు గురి కావడంతో ప్రయాణికులు, ప్రజలు ,రైతు లు ఇబ్బందులు పడుతుండడంతో ఇటీవల ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తక్షణమే మున్సిపాలిటీ నుండి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు అసౌకర్యాన్ని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ ని ఆదేశించారు. ఈ సందర్భంగా వీరి వెంట మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్,సిబ్బంది ఉన్నారు.
