Road safety | రోడ్డు భద్రత వారోత్సవాలు…

Road safety | రోడ్డు భద్రత వారోత్సవాలు…

Road safety | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జాతీయ రోడ్డు భద్రతా(Road safety) మాసోత్సవాలు 2026 పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కామారెడ్డి బస్సు డిపోలో ప్రారంభ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో కామారెడ్డి జిల్లా ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎం.వి.ఐ శంకర్ పాల్గొన్నారు. రోడ్డు భద్రత గురించి ఏఎస్పీ కామారెడ్డి డిపో సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. రోడ్డు భద్రత మాసోత్సవాలపై కామారెడ్డి డిపోలో
గురువారం రోజున ప్రారంభ వేడుక,
06న మంగళ వారం ట్రైనింగ్ డే,
07న బుధవారం రోజున మెడికల్ ఎగ్జామినేషన్ డే,
08న గురువారం రోజున మెయింటెనెన్స్ డే,
20న మంగళవారం రోజున ఫ్యామిలీ కౌన్సిలింగ్ డే,
22న గురువారం రోజున బ్లడ్ డొనేషన్ డే,
24న శనివారం రోజున డ్రైవర్స్ డే,
31 శనివారం రోజున ఫెలిసిటేషన్ డే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ దినేష్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ ఇంజనీర్, సెక్యూరిటీ సిబ్బంది డిపో సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply