చల్లపల్లి హైవే పై రోడ్డు ప్రమాదం..

చల్లపల్లి హైవే పై రోడ్డు ప్రమాదం..

(చల్లపల్లి – ఆంధ్రప్రభ)
రద్దీ ఎక్కువగా ఉండే క్రాస్ జంక్షన్ దగ్గర సభ్ వేలు నిర్మించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏలూరు వైపు నుండి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి రెండు బైకుల పై వస్తున్న ముగ్గురు యువకులు కృష్ణాజిల్లా చల్లపల్లి కల్లేపల్లి వెళ్లే హైవే జంక్షన్ వద్ద అడ్డుగా వచ్చిన రిక్షాను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు పైకి ఎగిరి చెల్లాచెదురుగా పడ్డారు. అయితే.. ముగ్గురు యువకులు హెల్మెట్ పెట్టుకుని ఉండటంతో ప్రాణ నష్టం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రిక్షా కార్మికుడికి కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. వాహనాలు కొంతమేర శిధిలమయ్యాయి.

Leave a Reply