రోడ్డు ప్రమాదంలో..
చేవెళ్ల, ఆంధ్రప్రభ : హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ప్రతినిత్యం ఈ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులవుతున్నారు. అయినా రోడ్డు విస్తరణ చేయడం లేదు. ఈ రోజు తెల్లవారు జామున హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ స్టేజి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు.

వికారాబాద్ జిల్లా యాలాల మండలం పగిడాల గ్రామానికి చెందిన సల్మాన్(25) వడ్ల రవి(26) పరిగి గల ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువులను పరమార్శించి తిరిగి స్కూటీపై హైదరాబాద్ కు వెళ్తున్నారు. మార్గమధ్యలో చేవెళ్ల మండలం మల్కాపూర్ స్టేజి వద్ద గుర్తు తెలియని వాహనం వీరు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్త గాయాలైన సల్మాన్, వడ్ల రవి అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఒకరు డ్రైవర్ గా మరొకరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతానికి కేసు దర్యాప్తులో ఉందని సీఐ శ్రీధర్ భూపాల్ తెలిపారు.
