Road accident | మరో బస్సు ప్రమాదం..

Road accident | మరో బస్సు ప్రమాదం..

Road accident, రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : వరంగల్ (Warangal) – హైదరాబాద్ (Hyderabad) జాతీయ రహదారి పై ఆదివారం మధ్యరాత్రి 1 గంట సమీపంలో నిడిగొండ గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పై ఆగి ఉన్న ఇసుక లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు పై ఆగి ఉన్న ఇసుక లారీ (టీజీ 07 యుకె 5469)ని వరంగల్ డిపో ఆర్టీసీ బస్సు (టీజీ 03జెడ్ 0046) బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు పులమాటి ఓం ప్రకాష్ (దిండిగల్), నవదీప్ సింగ్ (హనుమకొండ) మృతి చెందారు. గాయాలైన ప్రయాణికులను పోలీసులు జనగామ (Janagama) ఏరియా హాస్పిటల్ కి తరలించారు. బస్సు డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Leave a Reply