Road Accident | చనిపోయిన ఆ వ్యక్తి ఎవరు…?

Road Accident | చనిపోయిన ఆ వ్యక్తి ఎవరు…?
Road Accident | గన్నవరం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ (police station) పరిధిలోని కె సీతారామపురం సమీపంలో నేషనల్ హైవే బైపాస్ వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో సుమారు 45 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి వివరాలు తెలియడం లేదు. మృతి చెందిన వ్యక్తి ఎరుపు రంగు చొక్కా వేసుకొని ఉన్నారు. కావున ఈ వ్యక్తి వివరాలు తెలిసినవారు హనుమాన్ జంక్షన్ పోలీసులను సంప్రదించవలసినదిగా కోరుచున్నారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే.. హనుమాన్ జంక్షన్ ఎస్సై 9440796443 నెంబర్ కి ఫోన్ చేయాలన్నారు.
