Road | డ్రైనేజిపై ప్రీకాస్ట్ బిల్లలను ఏర్పాటు చేస్తున్న సర్పంచ్ శిరీష లోకేష్ గౌడ్

Road | డ్రైనేజిపై ప్రీకాస్ట్ బిల్లలను ఏర్పాటు చేస్తున్న సర్పంచ్ శిరీష లోకేష్ గౌడ్
Road | మర్రిగూడ, ఆంధ్రప్రభ: మండల కేంద్రం నుండి నాంపల్లి ప్రాంతానికి వెళ్లే రహదారి గ్రామంలో కొంత మేరకు రోడ్డు విస్తరణకు నోచుకోక ఇరుకుగా ఉండి భారీ వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేది కనీసం పాదాచారులు కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ఇట్టి విషయాన్ని గమనించిన స్థానిక సర్పంచ్ వీరమళ్ళ శిరీషలోకేష్ గౌడ్ పక్కనే ఉన్న డ్రైనేజీని ప్రీకాస్ట్ బిల్లలతో ప్రతిష్ట భద్రతతో ఏర్పాటు చేయడంతో పాదాచారులకు, ద్విచక్ర వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేశారు.
ఈ ఏర్పాటుతో భారీ వాహనాలు ఎదురెదురుగా వెళ్లిన కొంత మేరకు ఇబ్బంది లేకుండా చొరవ తీసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను అందరి సహకారంతో పరిష్కరిస్తానని గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని గ్రామ అభివృద్ధి నా ముఖ్యదేయమని అన్నారు.
