RIPSleepingPrince | స్లీపింగ్ ప్రిన్స్ అల్ వలీద్ కన్నుమూత

రియాద్ : సౌదీ అరేబియా యువరాజు “అల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్” కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 36 సంవత్సరాలు .కాగా.. గత ఇరవై ఏళ్లుగా కోమాలోనే ఉన్నారు.. గ్లోబల్ ఇమామ్ కౌన్సిల్ ఆయన మరణాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ విషాదకర ఘటనతో ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించింది.

స్లీపింగ్ ప్రిన్స్..

అల్ వలీద్ “స్లీపింగ్ ప్రిన్స్”గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1990 ఏప్రిల్‌లో జన్మించిన అల్ వలీద్.. బ్రిటన్‌లోని ఒక సైనిక కళాశాలలో చదువుతుండగా 2005లో జరిగిన కారు ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన రియాద్‌లోని ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ట్యూబ్ ద్వారా ఆహారం, వెంటిలేటర్‌ సాయంతో శ్వాస అందిస్తున్నారు.

2015లో వైద్యులు వెంటిలేటర్ తొలగించండి అని చెప్పినా కూడా.. యువరాజు తండ్రి ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ అందుకు తిరస్కరించారు. “భగవంతుడి చిత్తమే జరుగుతుంది.. ఒక్క అద్భుతం చాలు” అని ఆయన తన కుమారుడి ప్రాణాలను కాపాడేందుకు రోజూ ప్రార్థనలు చేస్తూ, కుటుంబంతో కలిసి పోరాటం కొనసాగించారు.

2020లో వీడియో వైరల్..

2020లో యువరాజు చెయ్యి వేళ్లను కదిపి తల తిప్పారు. దాంతో ఆయన కోలుకుంటారని అంతా భావించారు. అప్పట్లో అందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కానీ ఇప్పుడు ప్రిన్స్ ఖలీద్ మరణంతో.. ఆయన సోదరి ప్రిన్సెస్ రీమా బింట్ తలాల్ తన అధికారిక అకౌంట్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

అందులో “నా ప్రియమైన అల్ వలీద్ బిన్ ఖలీద్… ఇరవై ఒక్క సంవత్సరాలుగా మీరు మాకు ఎంతో విలువైనవారు. మిమ్మల్ని ప్రేమించే ప్రతి ఒక్కరి ప్రార్థనలలో మీరు ఎప్పుడూ ఉన్నారు అంటూ రాసుకొచ్చారు. మరోవైపు అల్ వలీద్ మరణానికి సంతాపంగా వేలాది మంది నెటిజన్లు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

One thought on “RIPSleepingPrince | స్లీపింగ్ ప్రిన్స్ అల్ వలీద్ కన్నుమూత

Leave a Reply