శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు బండారు చిట్టిబాబు(88) ఇకలేరు. బుధవారం రాత్రి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వీడిచారు. శ్రీకాకుళంలో నివసిస్తున్న ఆయన అనారోగ్య సమస్యతో స్థానిక ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హార్మోనియం సాధన చేస్తూ పదహారేళ్ల వయసులోనే ప్రముఖ సినీ నటులు రావి కొండలరావు, దూసి బెనర్జీ, తిమ్మరాజు శివరావు సహకారంతో సుకుమార్ ఆర్కెస్ట్రాను స్థాపించారు. ప్రముఖ సినీ గాయకులు గేదెల ఆనంద్, బి. ఎ. నారాయణ, మండపాక శారద వంటి వందల మంది శిష్యులను తీర్చిదిద్దారు. దేవులపల్లి, ఆరుద్ర, సినారె, జొన్నవిత్తుల, దూసి ధర్మారావు తదితర రచయితల సాహిత్యానికి స్వరాలద్దారు. ‘ రాధ కథ, విశ్వరథం, సుధా బిందువులు సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా సత్కారం పొందారు.
RIP | సంగీత విద్వాంసుడు బండారు చిట్టిబాబు ఇకలేరు
