15నుంచి ఏపీలో మ‌హిళ‌ల‌కు ఫ్రీ బ‌స్సు

ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్ డెస్క్ : కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేర‌కు ఏపీలో మహిళలకు (womens) ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించేందుకు శ‌ర‌వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. ఈనెల 15 నుంచి పథకం ప్రారంభించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో (RTC buses) మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ స్కీమ్​కు ప్రభుత్వం స్త్రీ శక్తి అనే పేరును సర్కార్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15న ఈ పథకాన్ని ప్రారంభించనుంది.

రాష్టంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా మహిళలు, ట్రాన్స్​జెండర్లకు (transgenders) ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్​ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) ప్రకటించారు. ఈనెల 15న దీనిని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ పథకాన్ని 5 కేటగిరి బస్సుల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో ఈ అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఆధార్, ఓటర్, రేషన్‌కార్డుల్ని గుర్తింపు కార్డులుగా పరిగణించనున్నట్టు వివరించారు.


ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి పథకానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టారు. మొత్తం ఐదు రకాల బస్సుల్లో (five types of buses) మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం కల్పించనున్నారు. మహిళలు ఆధార్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డు ఐడిలో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించి పల్లె వెలుగు (palle velugu), అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, నగరాల్లో మెట్రో, సిటీ సబర్బన్ సర్వీసులు ఉంటాయి. వీటిలో మాత్రమే ఎక్కడినుంచి ఎక్కడికి అయినా ఉచితంగా ప్రయాణించవచ్చు. అదే సమయంలో ప్రీమియర్ సర్వీసులుగా ఉన్న నాన్ స్టాప్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, తిరుమల ఘాట్ (Tirumala Ghat) రోడ్డులో వెళ్లే బస్సులకు ఉచిత ప్రయాణ పథకం వర్తించదు. పొరపాటున ఈ బస్సుల్లో ఎక్కితే టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే మహిళలు ఒకటికి రెండుసార్లు చూసుకుని బస్సులు ఎక్కాల్సి ఉంటుంది.


అయితే ఉచిత ప్రయాణ పథకంలో సైతం.. బస్సు ఎక్కిన మహిళలకు టికెట్లు ఇస్తారు. అయితే వాటిని జీరో ఫెర్ గా చూపిస్తారు. టికెట్ ధర జీరో గా చూపిస్తారు. వారు ప్రయాణించే స్టేషన్ల మధ్య టిక్కెట్ ధర (Ticket price) ను సైతం అందులో పొందుపరుస్తారు. అలా టికెట్ ధరను ప్రభుత్వ రాయితీ కింద చూపించనున్నారు. మరోవైపు ఉచిత ప్రయాణానికి సంబంధించి ఆర్టీసీ సిబ్బంది (RTC staff) కి శిక్షణ కూడా ఇస్తున్నారు. అనవసర వివాదాలు లేకుండా.. మహిళల పట్ల మర్యాదగా వ్యవహరించే విధంగా సిబ్బందికి పలు రకాల సూచనలు ఇస్తోంది ఏపీఎస్ఆర్టీసీ (APSRTC). మిగతా రాష్ట్రాల్లో ఈ పథకం అమలు జరుగుతుండగా అనేక రకాల వివాదాలు జరుగుతున్నాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply