తోటివారికి సహాయం చేయడంలోనే నిజమైన ఆనందం..

తోటివారికి సహాయం చేయడంలోనే నిజమైన ఆనందం..

గత 30 సంవత్సరాలుగా సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా..
13వ డివిజన్‌లో 3 ప్లాట్‌పారమ్‌ బండ్లు, రెండు రిక్షాలు, ఒక ఇస్త్రీ బండిని స్వయంగా అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

పటమట, ఆంధ్రప్రభ : తోటి వారికి సహాయం చేయడంలో నిజమైన ఆనందం కలుగుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. మంగళవారం తూర్పు నియోజకవర్గ పరి«ధిలోని 13వ డివిజన్‌ జేడీ నగర్‌లోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌ పరిసర ప్రాంతాల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన ప్రజలను అడిగి స్వయంగా తెల్సుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు.

అనంతరం స్వయం ఉపాధి చేసుకునేందుకు మూడు తోపుడు బండ్లు, రెండు రిక్షా బండ్లు, ఒక ఇస్త్రీబండిని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తన సొంత నిధులతో కొనుగోలు చేసి నిరుపేద కుటుంబాలకు ఉచితంగా అందచేశారు. సాయిరమ, వై.చిన్నముడు, చెక్క మహాలక్ష్మిలకు తోపుడు బండ్లు, లాబెట్టి నాగార్జున, ఇప్పిలి వేలప్పుడులకు రిక్షా బండ్లు, కొడూరు జోగయ్యకు ఇస్త్రీ బండిని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ స్వయంగా అందచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ మఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పీ–4 పథకం గురించి ప్రతి వేదికపైన చెబుతున్నారన్నారు. పవిత్రమైన ఖరాన్, బైబిల్, భగవద్గీత చూసినా తోటి వారికి సహాయం చేయమనే ఉందన్నారు. దేవుడుకు పూజ, సేవ చేయడం కంటే తోటి వారికి సహాయం చేయడం మంచిందని చెప్పారు. తాను 30 సంవత్సరాలుగా ఇదే విధంగా సొంత నిధులతో తన వంతుగా పేదలకు సహాయం చేస్తున్నానని చెప్పారు.

వైద్య సహాయం, పేద విద్యార్థులకు ఫీజులు, జీవనోపాధికి బండ్లు పంపిణీ చేస్తున్నానని అన్నారు. రిక్షా కార్మికుడు కూడా తాను రోజు వారి సంపాదనలో కొంత భాగం తోటి వారికి సహాయం చేసి పీ–4లో భాగం కావచ్చునని చెప్పారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు తన దగ్గర ఉన్నంతలోనే తనకు తోచిన విధంగా సహాయం చేయాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. ఫారెస్ట్‌ డవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ డైరెక్టర్‌ గద్దె ప్రసాద్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తన సొంత నిధులతో పేదల ఆర్థిక అవసరాలను తీర్చేవిధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

గత 30 సంవత్సరాల క్రితం నుంచే ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ముమ్మనేని ప్రసాద్‌ మాట్లాడుతూ పేదలకు కష్టం వస్తే వెంటనే వారు వచ్చేది ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ కార్యలయానికేనని చెప్పారు. ప్రతి రోజూ నియోజకవర్గంలో ఏదో ఒక డివిజన్‌లో ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తన సొంత నిధులతో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.

బండ్లతో పాటుగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ వ్యాపారానికి అవసరమైన ముడిసరుకు కొనుగొలు చేయడానికి సైతం ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 13వ డివిజన్‌లో రూ.6 కోట్ల వ్యయంతో అభివృద్థి పనులు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నూతి శ్రీను, కొర్రపాటి శ్రీను, ధూళిపాళ్ళ రాజేష్, వేములపల్లి శ్రీను, లోకేశ్వరరావు, యల్లబాబు, సొంటి నాగేశ్వరరావు, సింగంశెట్టి రమేష్, కర్ణ రమేష్, డాంగేకుమారి, తిరుమలశెట్టి నాని, మాదిరెడ్డి రవి, సాయిలక్ష్మి, హారిక, ముమ్మనేని రాజా, బాలరాజు, నాని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply